బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 11:07:24

ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి

బరన్‌ : రాజస్థాన్‌లోని బరన్ జిల్లా షహాబాద్ ప్రాంతంలో ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇటీవల పాఠశాల పరిసరాల్లో ఆడుకుంటున్న చిన్నారిపై మహావీర్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని షహాబాద్‌ పోలీస్‌ స్టేషన్ ఇన్‌చార్జి హరిప్రసాద్‌ రాణా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.


logo