శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:54:28

రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రాతో సీఎం గెహ్లాట్ భేటీ

రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రాతో సీఎం గెహ్లాట్ భేటీ

జైపూర్‌: రాజస్థాన్‌లో రాజ‌కీయ అనిశ్చితి ఇంకా కొన‌సాగుతున్న‌ది. అసెంబ్లీ స‌మావేశాల కోసం ప‌ట్టుబ‌డుతున్న ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ బుధ‌వారం మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రాతో స‌మావేశ‌మ‌య్యారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆమోదం తెలుపాల‌ని కోరారు. అయితే గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రా దీనికి స‌మ్మ‌తి తెలుప‌లేదు. కాగా రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై చ‌ర్చించేందుకు అసెంబ్లీ స‌మావేశం జ‌రుప‌వ‌చ్చ‌ని ఇప్ప‌టికే ఆయ‌న తెలిపారు. మ‌రోవైపు త‌మ ప్ర‌భుత్వానికి సంఖ్యాబ‌లం ఉన్న‌ద‌ని, స‌భ‌లో దీన్ని నిరూపించుకుంటామ‌ని సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. 

సీఎం గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన స‌చిన్‌పైల‌ట్‌తోస‌హా ఆయ‌న వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేల‌పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ఈ అంశం కోర్టుకు చేరింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాదిరిగా రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని, త‌మ పార్టీ స‌భ్యుల‌కు డ‌బ్బులు, ప‌ద‌వుల‌ను ఎర‌వేస్తున్న‌ద‌ని సీఎం గెహ్లాట్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపుల‌పై రాజ‌స్థాన్ పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ ఆడియో టేపులో మాట్లాడిన‌ట్లు ఆరోప‌ణ‌లున్న కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెఖావ‌త్‌తో పాటు ఇద్ద‌రు రెబ‌ల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.logo