సోమవారం 13 జూలై 2020
National - May 03, 2020 , 13:17:04

హంద్వారా అమ‌ర జ‌వాన్ల‌కు ర‌క్ష‌ణ మంత్రి నివాళి..

హంద్వారా అమ‌ర జ‌వాన్ల‌కు ర‌క్ష‌ణ మంత్రి నివాళి..

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని హంద్వారాలో ఇవాళ జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు జ‌వాన్లు మృతిచెందారు. దాంట్లో క‌ల్న‌ల్ అశుతోష్ కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. హంద్వారా ఘ‌ట‌న తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఉగ్ర‌వాదుల‌పై పోరాటం చేసేందుకు జ‌వాన్లు అత్యుత్త‌మ ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌న్నారు. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన‌ట్లు చెప్పారు.  వారి ధైర్య‌సాహ‌సాల‌ను, త్యాగాల‌ను మేం ఎన్న‌టికీ మ‌ర‌వ‌మ‌న్నారు.  ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళ్లు అర్పిస్తున్న‌ట్లు తెలిపారు. వీర మ‌ర‌ణం పొందిని సైనిక కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అసామాన్య ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తున్న అమ‌ర సైనికుల కుటుంబాల‌కు భార‌త్ అండ‌గా ఉంటుంద‌న్నారు. ఇవాళ కుప్వారా జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఓ క‌ల్న‌ల్‌, మేజ‌ర్‌తో పాటు మ‌రో ముగ్గురు జ‌వాన్లు మృతిచెందారు.


logo