శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 17:30:16

చెన్నైని ముంచెత్తిన వానలు.. మరో ఐదు రోజులు కురిసే అవకాశం

చెన్నైని ముంచెత్తిన వానలు.. మరో ఐదు రోజులు కురిసే అవకాశం

చెన్నై : కరోనా వైరస్‌ సంక్రమణ నేపథ్యంలో గత ఆరేడు నెలలుగా అతలాకుతలం అయిన చెన్నైని ప్రస్తుతం వానలు కుదిపేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వానలకు.. గత ఏడాది అనుభవాల కారణంగా ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టంచేసింది.

ఈశాన్య రుతుపవనాల రాకతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమనం తేదీకి 13 రోజుల తరువాత బుధవారం మొత్తం దేశం నుంచి వైదొలిగాయి. ఉత్తర తమిళనాడు తీరంలో దిగువన, మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ప్రసరణ ఉన్నదని వాతావరణ బ్యూరో తెలిపింది. వచ్చే ఐదు రోజుల్లో కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయిని, వచ్చే రెండు రోజుల్లో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నది. రానున్న నాలుగైదు రోజులలో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.