మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 10:56:20

ముంబైను ముంచెత్తిన వర్షాలు.. పలు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌

ముంబైను ముంచెత్తిన వర్షాలు.. పలు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌

ముంబై : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన రెడ్ అలర్ట్ మధ్య బుధవారం ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జీవనం దెబ్బతిన్నది. ఈరోజు మొత్తం ముంబైలో భారీ నుంచి అతిభారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  గడిచిన 12 గంటలుగా నగరంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పశ్చిమ శివారు ప్రాంతాల్లో 150 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం కురువడంతో ఆయా ప్రాంతాలు నీటమునిగాయని ఐఎండీ బుధవారం తెలిపింది.

మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్, పూణే, అహ్మద్‌నగర్, నాసిక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే బుధవారం రోజున ముంబైకి హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలోని మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడ వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

పదేళ్ల తరువాత ఆగస్టు నెలలో ముంబైలో 24 గంటల్లో రెండోసారి అత్యధిక వర్షపాతం (286.6మి.మీ) నమోదైంది. ముంబై, శివారు ప్రాంతాల్లోని కొన్ని మార్గాల్లో మంగళవారం ఉదయం స్థానిక రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఇండ్ల నుంచి ఏ ఒక్కరూ బయటికి రావొద్దని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo