గురువారం 16 జూలై 2020
National - Jun 28, 2020 , 14:40:14

సిక్కింలో కుండపోత వర్షాలు

సిక్కింలో కుండపోత వర్షాలు

సిక్కిం : సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి, ఇండ్లలోకి నీళ్లు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగాటోక్‌లో  పొలాలు నాశనమవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంట వరదలో కొట్టుకుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నుంచి పంటను రక్షించడానికి  వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. వరద ఉధృతికి ఇండ్లలోని సామాన్లు సైతం కొట్టుకుపోతున్నాయి.  logo