మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:45:45

గుజరాత్‌ను ముంచెత్తుతున్న వర్షాలు

గుజరాత్‌ను ముంచెత్తుతున్న వర్షాలు

గాంధీనగర్‌ : వరుస వర్షాలతో గుజరాత్‌లోని కొన్ని జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. అక్కడ గత మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే పలు జిల్లాలు నీటమునిగాయి. రోడ్లపైన భారీగా వరద నిలువడంతో చాలా చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ సిబ్బంది రెండు రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నా రోడ్లపై నీళ్లు పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షాలు తగ్గితే కాని పరిస్థితి కుదుటపడకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ద్వారకా నగరంలో కురిసిన వర్షాలతో వరద రోడ్లపైకి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజరాత్‌లో మంగళవారం వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురవడంతో గత రెండు రోజుల్లో సౌరాష్ట్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 1,000 మందికి పైగా ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినట్లు సమాచారం. అదే విధంగా బుధవారం కూడా కచ్‌ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో అక్కడి రోడ్లన్నీ వరదతో నిండిపోయాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo