మంగళవారం 07 జూలై 2020
National - May 29, 2020 , 18:58:42

రేవా‌రిలో భారీ వ‌ర్షం.. వ‌డ‌గండ్ల బీభ‌త్సం

రేవా‌రిలో భారీ వ‌ర్షం.. వ‌డ‌గండ్ల బీభ‌త్సం

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం రేవారి జిల్లాలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టించాడు. ప‌గ‌లంతా ఎండ‌ల‌తో మండిపోయిన రేవారి న‌గ‌రంలో సాయంత్రానికి ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ద‌ట్టంగా మ‌బ్బులు క‌మ్ముకుని ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం కురిసింది. రేవారి న‌గ‌రంతోపాటు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో వ‌డగండ్లు కురిశాయి. బ‌ల‌మైన ఈదురుగాలుల కార‌ణంగా రేవారి సిటీలోని ప‌లుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మ‌లు విరిగిప‌డ్డాయి. అయితే, గ‌త నాలుగైదు రోజులుగా తీవ్ర‌మైన ఎండ‌ల‌తో స‌త‌మ‌త‌మైన న‌గ‌ర ప్ర‌జ‌లకు ఇవాళ కురిసిన వ‌ర్షంతో భారీ ఉప‌శమ‌నం ల‌భించింది.


logo