బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 16:20:34

రాబోయే ఐదు రోజుల్లో వర్ష సూచన : ఐఎండీ

రాబోయే ఐదు రోజుల్లో వర్ష సూచన : ఐఎండీ

చెన్నై : తమిళనాడులో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, పుదుచ్చేరిలోని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. తీర తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, చెన్నైలోని వివక్త ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, రామనాథపురం, తిరునెల్వేలి, తుత్తుకుడి, మాయిలాదుత్తురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం జిల్లాలో వర్షం పడుతుందని పేర్కొంది. పుదుచ్చేరిలో సైతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-25 డిగ్రీలు ఉండవచ్చని వివరించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.