మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 19:57:51

శ్రామిక్‌ రైళ్ళుగా 50 శాతం రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లు

శ్రామిక్‌ రైళ్ళుగా 50 శాతం రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లు

న్యూడిల్లీ: కరోనా వైరస్‌ రోగులకు చికిత్స చేసేందుకు ఉద్దేశించి తయారు చేసిన 5,213 రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లలో 50 శాతం కోచ్‌లను శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ళుగా నడపడానికి రైల్వే నిర్ణయం తీసుకుంది. మే 21 నాటి ఉత్తర్వులలో భాగంగా రైల్వే బోర్డు ఈ మార్పు చేసిన బోగీల్లో 60 శాతం ప్రత్యేక రైళ్లను నడపడానికి, వలసదారులను తీసుకెళ్లడానికి అనుమతించిందని తెలిపారు అధికారులు. ఈ నాన్‌-ఎసి కోచ్‌లు సాధారణ కోచ్‌లుగా మార్చబడవు కానీ ఈ రకమైన సేవలకు ఉపయోగించబడుతుందని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు 5,000 కోచ్‌లను మార్చినట్లు, 80,000 పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రానున్న కాలంలో రాష్ర్టాలు కోరుకున్న చోట ఈ కోచ్‌లను ఉపయోగించవచ్చు, కాని అవి ఇప్పటికి ఉపయోగంలో లేనందున, వాటిలో 50 శాతం శ్రామిక్‌ స్పెషల్‌ కోచ్‌లుగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వి కె యాదవ్‌ చెప్పారు.


logo