గురువారం 09 జూలై 2020
National - Jan 27, 2020 , 17:17:07

2024 క‌ల్లా దేశ‌మంతా రైల్వే విద్యుద్దీక‌ర‌ణ‌

2024 క‌ల్లా దేశ‌మంతా రైల్వే విద్యుద్దీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌:  డీజిల్ లోకో షెడ్‌ల‌ను త్వ‌ర‌లో సంపూర్ణంగా మూసివేయ‌నున్నామ‌ని, 2024 క‌ల్లా దేశ‌మంతా విద్యుద్దీక‌ర‌ణ పూర్తి అవుతుంద‌ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు.  దీంతో దేశ‌మంతా విద్యుత్‌తో న‌డిచే తొలి రైల్వే నెట్వ‌ర్క్ ప్ర‌పంచంలో మ‌న‌దే కానున్న‌ట్లు మంత్రి చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే లైన్ల విద్యుద్దీక‌ర‌ణ వేగ‌వంతం చేశామ‌న్నారు. ఢిల్లీలో జ‌రిగిన‌ ఇండో-బ్రెజిల్ బిజినెస్ ఫోర‌మ్‌లో మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు.  2030 క‌ల్లా నెట్ జీరో ఎమిష‌న్ నెట్వ‌ర్క్‌గా రైల్వే వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్ద‌నున్న‌ట్లు తెలిపారు. మౌళిక‌స‌దుపాయాల అభివృద్ధిపై బ్రెజిల్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. 

   


logo