ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:46:18

రైల్‌ టికెట్ల బుకింగ్‌ మరింత సులభతరం చేసేందుకు..

రైల్‌ టికెట్ల బుకింగ్‌ మరింత సులభతరం చేసేందుకు..

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. వినియోగదారులు ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లను మరింత సులభతరంగా బుక్‌ చేసేందుకు అధికారిక వైబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తుంది. రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ అయిన www.irctc.co.in చివరిసారిగా 2018లో అప్‌గ్రేడ్ చేసింది. ఈ సారి పూర్తిగా పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మరింత సరకళీకృతం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకేయాదవ్‌ తెలిపారు. పోర్టల్‌లో హోటల్ బుకింగ్‌‌, భోజనం ఆర్డర్‌ అనుసంధానించనున్నట్లు పేర్కొన్నారు. పునరుద్ధరించిన ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్‌ వైబ్‌సైట్‌ను ఆగస్టులో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.

కొత్త పోర్టల్‌ ప్రయాణీకులకు మెరుగైన అనుభవం ఉంటుందని చైర్మన్‌ పేర్కొన్నారు. ప్రయాణీకులకు అనుకూలంగా మార్చేందుకు సెర్చ్‌ రైళ్లకు సులభమైన ఫిల్టర్లు, అన్ని రైళ్లలో సీట్ల లభ్యత, చార్జీల ప్రదర్శన, వెయింట్‌ లిస్ట్‌ కన్ఫర్మేషన్‌ ప్రాబబిలిటీ వంటి ఫీచర్లను చేర్చనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైళ్ల ట్రాకింగ్‌ కోసం భారత అంతరక్షి పరిశోధన సంస్థ (ఇస్రో)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రైలు ఎక్కడ ఉందో ఖచ్చిత్వంతో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని రైల్వే చైర్మన్‌ పేర్కొన్నారు. కాగా, కాంటాక్ట్‌ లెస్‌ టికెట్‌ తనిఖీని నిర్ధారించేందుకు క్యూఆర్‌ కోడ్‌ టికెట్లను ఉత్పత్తి చేస్తామని ఈ నెల 23న రైల్వేశాఖ తెలిపింది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుక్‌ చేసుకునే ప్రయాణీకులకు ఈ సదుపాయాన్ని పొందవచ్చని, ఫలితంగా, ప్రయాణీకులు, రైల్వే ఉద్యోగుల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. టికెట్ కొనుగోలు చేసే ప్రయాణీకులకు క్యూఆర్‌ కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌ అందుతుంది. టికెట్‌ తనిఖీ చేసే అధికారులు హ్యాండ్‌హెల్డ్‌ పరికరాలను ఉపయోగించి స్కాన్‌ చేస్తారు. ఈ ప్రారంభంలో స్టేషన్లలో కాంటాక్ట్‌లెస్‌ టికెట్‌ తనిఖీలను నిర్వహించేందుకు సిబ్బంది కోసం ‘చెక్‌ ఇన్‌ మాస్టర్‌’ యాప్‌ను రైల్వే ప్రారంభించింది. ఓసీఆర్‌, క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయడం ద్వారా పీఆర్‌ఎస్‌, యూటీఎస్‌ టికెట్లను తనిఖీ చేయవచ్చని అధికారులు వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo