శుక్రవారం 29 మే 2020
National - May 10, 2020 , 21:33:07

ఎల్లుండి నుంచి కొన్ని రైళ్లు నడుస్తాయ్‌

ఎల్లుండి నుంచి కొన్ని రైళ్లు నడుస్తాయ్‌

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రైవేట్‌ వాహనాలు, బస్సులు, రైళ్లు గత 50 రోజులుగా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే, ప్రజల అవసరాలు తీర్చేందుకు మెల్లమెల్లగా రైళ్లను నడిపించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. తొలుత ఎల్లుండి నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు నడుపాలని నిర్ణయించారు. రైల్వే బుకింగ్‌లను రేపు సాయంత్రం  నాలుగు గంటల నుంచి ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు 15 రైళ్లను నడుపనున్నారు.

ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్‌, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్‌, ముంబై సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్ముతావికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లలో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌లను వాడాలని రైల్వే శాఖ సూచించింది. స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపిన తర్వాత రైళ్లలోకి అనుమతిస్తామని పేర్కొన్నది. రేపు రైళ్ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రైల్వేశాఖ  తెలిపింది.


logo