గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 06:35:47

కాంటాక్ట్‌లెస్‌ రైల్‌ టికెట్స్‌

కాంటాక్ట్‌లెస్‌ రైల్‌ టికెట్స్‌

  • క్యూ ఆర్‌ కోడ్‌తో కొత్త టికెట్ల జారీ 

న్యూఢిల్లీ : కరోనా కారణంగా భౌతికదూరం అనివార్యమైన వేళ రైల్వేబోర్డు టికెట్ల విషయంలో మార్పులు తెస్తున్నది. ఇక నుంచి టికెట్లు క్యూఆర్‌ కోడ్‌తో విమాన టికెట్ల మాదిరిగా ఉంటాయని రైల్వేబోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం 85శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌చేసుకుంటున్నారని, వాటిపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని చెప్పారు. కౌంటర్లలో కొనుగోలుచేసే టికెట్లకు కూడా ఇకనుంచి క్యూఆర్‌ కోడ్‌ అందిస్తామని వెల్లడించారు. కౌంటర్లో టికెట్‌ కొనగానే రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఆన్‌లైన్‌ లింక్‌ వస్తుందని, దానిని ప్రెస్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ ఓపెన్‌ అవుతుందని వివరించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో భౌతికంగా టికెట్లను తాకకుండానే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుందన్నారు. 


logo