ఆదివారం 29 మార్చి 2020
National - Feb 19, 2020 , 00:55:41

‘తత్కాల్‌'ను కొల్లగొడుతున్న 60 మంది అరెస్ట్‌

‘తత్కాల్‌'ను కొల్లగొడుతున్న 60 మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తత్కాల్‌ టికెట్లను కొల్లగొడుతున్న 60 మంది ఏజెంట్లను రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇకపై మరిన్ని తత్కాల్‌ టికెట్లు రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్లు అయిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొందరు ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి టికెట్లను బ్లాక్‌ చేయడం లేదా వేగంగా టికెట్లను బుకింగ్‌ చేసుకోవడం చేస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవడానికి 2.55 నిమిషాల సమయం పడుతుంది. కానీ కొందరు ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ఈ ప్రక్రియను 1.48 నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. దీంతో బుకింగ్‌ ప్రారంభమైన నిమిషాల్లోనే తత్కాల్‌ టికెట్లు అయిపోతున్నాయి. దీన్ని గుర్తించిన ఆర్పీఎఫ్‌ అధికారులు అక్రమ సాఫ్ట్‌వేర్లను కనిపెట్టి తొలిగించడంతోపాటు 60 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరిలో ఒకడికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.logo