సోమవారం 13 జూలై 2020
National - Jun 04, 2020 , 17:48:32

1885 కోట్లు రీఫండ్‌ చేసిన రైల్వే...

1885 కోట్లు రీఫండ్‌ చేసిన రైల్వే...

డిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణానికి అప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ సమయంలో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు 1,885 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించామని రైల్వే శాఖ తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి జరగకుండాప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగా రైల్వే వారి టికెట్లను రద్దు చేసింది. రైళ్లు భారీగా రద్దు చేయబడినందున, రైల్వే ప్రయాణికులకు తిరిగి చెల్లించటానికి భారీ మొత్తంలో డబ్బును తిరిగి ఇవ్వడానికి రైల్వే శాఖ పెద్ద సవాలునే ఎదుర్కొందని రైల్వే అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ పద్దతిలో బుక్‌ చేసుకున్న టిక్కెట్లపై మార్చి 21 నుంచి మే 31 వరకు ప్రయాణికుల టికెట్లను రద్దు వారికి రైల్వే 1885 కోట్ల రూపాయలను విజయవంతంగా తిరిగి ఇచ్చిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఎంత మొత్తం చెల్లించారో అంత పూర్తి మొత్తాన్ని వారికి తిరిగి రీఫండ్‌ చేశారు అధికారులు. దీనిలో ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయలేదు రైల్వే. టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఏ ఖాతా నుంచి చెల్లింపులు చేశారో అదే ఖాతాలో తిరిగి డబ్బు వేయబడింది. ఈ క్రమంలో వినియోగదారులు తిరిగి రైల్వేను సంప్రదించాల్సిన అవసరం లేకుండా డబ్బులు వాపస్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.


logo