శుక్రవారం 10 జూలై 2020
National - Mar 26, 2020 , 12:48:41

సామాజిక దూరానికి రైల్వేస్‌ చేయూత

సామాజిక దూరానికి రైల్వేస్‌ చేయూత

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు రైల్వేస్‌ తనవంతు చేయూతను అందిస్తుంది. ఇందుకు ఓ సంఘటనను నిదర్శనంగా తెలియజేస్తూ రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ ఆపత్కాలంలో సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో రైల్వేకు చెందిన ఖాళీ ప్రదేశాలను, మైదానాలను కూరగాయల మార్కెట్లు నిర్వహించేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణార్థం అదేవిధంగా రైల్వే సిబ్బంది రక్షణార్థం ఈ చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌ రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. డబ్బాలు డబ్బాలుగా ముగ్గుతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. 


logo