శనివారం 04 జూలై 2020
National - May 06, 2020 , 02:16:15

ఇబ్బందులు కలుగజేసే వారిపై నిఘా!

ఇబ్బందులు కలుగజేసే వారిపై నిఘా!

శ్రామిక రైళ్ల కోసం మార్గదర్శకాల విడుదల

న్యూఢిల్లీ: శ్రామిక ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగజేసే వారిపై నిఘా ఉంచాలని అన్ని జోన్ల రైల్వేలను భారతీయ రైల్వే ఆదేశించింది. బోగీలను తరుచూ శుభ్రపరుచాలని సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని సోమవారం విడుదల చేసింది. వలస కార్మికులు రైల్ల్లోకి ఎక్కే ప్రాంతం, దిగే ప్రాంతంతో పాటు రైల్లో  ప్రయాణిస్తున్న సమయంలో భద్రతా నియమాల్ని పాటించాలని తెలిపింది. దీని కోసం మాజీ సైనికులు, హోంగార్డులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సాయాన్ని తీసుకోవాలన్నది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు 76 ప్రత్యేక రైళ్ల ద్వారా 70 వేల మందికిపైగా కూలీలను తరలించినట్లు తెలిపింది. ఇందుకోసం రూ.50 కోట్లకు పైగా వెచ్చించినట్లు పేర్కొంది. 


logo