శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 01:20:46

టిక్కెట్ల రద్దు చార్జీలతో రైల్వేకు తొమ్మిదివేల కోట్ల ఆదాయం

టిక్కెట్ల రద్దు చార్జీలతో రైల్వేకు తొమ్మిదివేల కోట్ల ఆదాయం

కోట: రైల్వే టిక్కెట్ల రద్దు, వెయిటింగ్‌ లిస్ట్‌లోని టిక్కెట్లను ప్రయాణికులు రద్దు చేసుకోకపోవడం వల్ల 2017-20లో రైల్వేకు రూ.9000 కోట్ల ఆదాయం వచ్చింది. రాజస్థాన్‌లోని కోట ఆర్టీఐ కార్యకర్త సుజిత్‌ స్వామి దరఖాస్తుపై ‘ది సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌' సమాధానమిచ్చింది. 2017 జనవరి 1 నుంచి 2020 జనవరి 31 వరకు 9.5 కోట్ల మంది ప్రయాణికులు వెయిటింగ్‌ లిస్ట్‌లోని తమ టిక్కెట్లను రద్దు చేసుకోనందున రూ.4,335 కోట్ల ఆదాయం, టిక్కెట్ల రద్దు కోసం చెల్లించిన ఫీజు వల్ల రూ.4,684 కోట్లకి పైగా ఆదాయం వచ్చిందని తెలిపింది. 

logo