గురువారం 03 డిసెంబర్ 2020
National - Jul 02, 2020 , 02:15:45

ప్రైవేటుకు రైళ్ల నిర్వహణ

ప్రైవేటుకు రైళ్ల నిర్వహణ

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణకు ప్రైవేటుసంస్థలను అనుమతిస్తూ రైల్వే బుధవారం రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్లకు ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఉన్న 109 (రానూ పోను) రూట్లలో 151 రైళ్ల నిర్వహణకు సంబంధించి ఈ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా రూ.30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను రైల్వే సేకరించనుంది. రైల్వేల చరిత్రలో ప్రైవేటుసంస్థలను అనుమతించటం ఇదే తొలిసారి. ప్రయోగాత్మకంగా గతేడాది ఐఆర్‌సీటీసీ లక్నో-ఢిల్లీ మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపింది.