గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 18:32:05

అన్ని రకాల రైల్వే టికెట్‌ రాయితీలు బంద్‌

అన్ని రకాల రైల్వే టికెట్‌ రాయితీలు బంద్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర ప్రయాణికులు తప్ప ఇతరులు ప్రయాణం చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. యూటీఎస్‌, పీఆర్‌ఎస్‌ టికెట్లపై పూర్తి రాయితీని తొలగిస్తున్నట్లు తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే, స్వస్థలాలకు వెళుతున్న విద్యార్థులకు, నాలుగు రకాల దివ్యాంగులకు, 11 రకాల పేషంట్లకు తప్ప మిగితా అందరికీ రాయితీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 20-03-2020 నుంచి బుక్‌ చేసుకునే వారికి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.


logo