మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 17:12:09

ఇక రైల్వే స్టేషన్లలో కూడా టికెట్లు కొనొచ్చు

ఇక రైల్వే స్టేషన్లలో కూడా టికెట్లు కొనొచ్చు

న్యూఢిల్లీ: సాధారణ ప్రయాణికులు టికెట్లు బుక్‌చేసుకునే అవకాశాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పించింది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన రైల్వే సర్వీసులను జూన్‌ 1 నుంచి తిరిగి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ స్టేషన్ల నుంచి నడవనున్న 230 రైళ్లకు సంబంధించి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ను మే 21న ప్రారంభించింది. కాగా, రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, యాత్రి టికెట్‌ సువిధా కేంద్రాల్లో టికెట్ల అమ్మకాలను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులు టికెట్లను బుక్‌చేసుకోవడంతో పాటు, ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్లను క్యాన్సల్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ దత్‌బాజ్‌పై వెల్లడించారు. 


logo