గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 18:01:33

షుకుర్‌ బస్తీ ఐసోలేషన్‌ రైల్వే కోచ్‌లో చేరిన తొలి బాధితుడు

షుకుర్‌ బస్తీ ఐసోలేషన్‌ రైల్వే కోచ్‌లో చేరిన తొలి బాధితుడు

న్యూఢిల్లీ  : దేశ రాజధాని ఢిల్లీలోని షుకుర్‌ బస్తీలో ఏర్పాటు చేసిన రైల్వే ఐసోలేషన్‌ వార్డులో మొదటి బాధితుడు చేరినట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం తెలిపారు. ‘కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో.. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని రైల్వేమంత్రి ట్వీట్‌ చేశారు. అంతకు ముందు రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఢిల్లీలోని పలు స్టేషన్లను కొవిడ్‌-19 బాధితుల కోసం ఐసోలేషన్‌ వార్డులుగా 503 కోచ్‌లను మార్చినట్లు తెలిపారు. ఆనంద్ విహార్ స్టేషన్‌ కేర్‌ సెంటర్‌గా మార్చామని, 4000 బెడ్లతో 267 కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. షకుర్ బస్తీ స్టేషన్‌లో 50 కోచ్‌లను మోహరించినట్లు వివరించారు. 


logo