ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 06, 2020 , 02:32:21

మరో 80 ప్రత్యేక రైళ్లు

మరో 80 ప్రత్యేక రైళ్లు

  • ఈ నెల 12 నుంచి ప్రారంభం   
  •  గురువారం నుంచి రిజర్వేషన్లు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: ప్రయాణికుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ  సిద్ధమైంది. ఇప్పటికే 230 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న ఆ శాఖ మరో 80 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ శనివారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించారు. ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నట్టు వివరించారు. 

డిసెంబర్‌ 15 నుంచి రైల్వే పరీక్షలు

కరోనా కారణంగా వాయిదాపడ్డ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలపై యాదవ్‌ కీలక ప్రకటన చేశారు. మూడు విభాగాల్లోని దాదాపు 1.40 లక్షల పోస్టుల నియామకానికి డిసెంబర్‌ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వివరించారు. 


logo