శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 21:42:03

రోగుల సేవలో రైల్‌ బోట్‌

రోగుల సేవలో రైల్‌ బోట్‌

హైదరాబాద్‌: వైద్య సిబ్బందికి రోగులకు మధ్య భౌతిక దూరం పాటించేలా దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. సిబ్బంది ప్రత్యక్షంగా రోగుల వద్దకు వెళ్లకుండా సేవలు అందించేలా రూపొందించిన ఈ పరికరానికి రైల్‌ బోట్‌ అని నామకరణం చేశారు. సికింద్రాబాద్‌ లాలాగూడ రైల్వే సెంట్రల్‌ హాస్పిటల్‌లో ఈ రోబో సేవలను వినియోగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ అదనపు డివిజనల్‌ మేనేజర్‌ హేమ్‌సింగ్‌ బానోత్‌ బృందం దీనిని రూపొందించింది. ఆ బృందానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అభినందనలు తెలియజేశారు.

ఆర్‌-బోట్‌ ద్వారా రోగులకు మందులు, ఆహారం అందజేయడానికి వీలుంటుంది. తద్వారా వైద్యసిబ్బంది భౌతికదూరాన్ని పాటించవచ్చు. రియట్‌ టైమ్‌ వీడియో కెమెరా కలిగిన ఆర్‌-బోట్‌.. వైద్యులు, రోగుల మధ్య సంభాషణలను రికార్డుచేస్తుంది. మొబైల్‌యాప్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం.. తన సెన్సార్ల ద్వారా రోగుల శరీర ఉష్ణోగ్రతలను గ్రహించడమే కాకుండా ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉంటే అలారం మోగిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు.


logo