ఆదివారం 12 జూలై 2020
National - Jun 22, 2020 , 14:53:57

మ‌న్మోహ‌న్ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణించండి: రాహుల్‌గాంధీ

మ‌న్మోహ‌న్ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణించండి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: ‌కేంద్ర ప్ర‌భుత్వం జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చైనాతో వివాదంపై పూర్తి సమాచారాన్ని బయట పెట్టాలని, సమాచారం దాచడం సమర్థ నాయకత్వానికి శోభనివ్వదని మన్మోహన్‌సింగ్ ఈ ఉద‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణించాల‌ని రాహుల్ పేర్కొన్నారు.     

ఇక‌, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన జవాన్లకు రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. వారి త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. 'జవాన్లకు నివాళులు. మీరు మా కోసం అన్ని వదులుకున్నారు. మీ త్యాగాలను ఎప్పటికీ మరిచిపోంస‌ అని రాహుల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సలహాలిచ్చారని, వాటిని ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నాన‌ని రాహుల్ వ్యాఖ్యానించారు.


logo