మంగళవారం 14 జూలై 2020
National - Jun 28, 2020 , 19:29:36

రాహుల్‌ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలి : అమిత్‌ షా

రాహుల్‌ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలి : అమిత్‌ షా

న్యూఢిల్లీ : భారత్‌-చైనా ఘర్షణ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. భారత్‌-చైనా ఘర్షణ గురించి పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాహుల్‌ గాంధీ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వం దేనికైనా జవాబు ఇస్తుందని, 1962 నుంచి నేటి వరకు ఏం జరిగిందో పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌ షా పేర్కొన్నారు.

రాహుల్‌ కావాలనే రాజకీయాలు చేస్తున్నారని. సరెండర్‌ మోదీ జీ అనే హ్యాష్‌ ట్యాగ్‌పై రాహుల్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను పాకిస్థాన్, చైనా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. భారత వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొనే సత్తా తమ ప్రభుత్వానికి ఉందన్నారు. 


logo