సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 13:35:16

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ లోధి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను ప్రొటెం స్పీక‌ర్ రామేశ్వ‌ర్ శ‌ర్మ‌కు అంద‌జేశారు. అనంత‌రం నేరుగా బీజేపీ కార్యాల‌యానికి వెళ్లి కాషాయం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స‌మక్షంలో రాహుల్ లోధి బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌కు కాషాయ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.