సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 20, 2020 , 17:37:47

'చైనాను ఎప్పుడు త‌రిమెస్తారో తేదీతో స‌హా చెప్పండి'

'చైనాను ఎప్పుడు త‌రిమెస్తారో తేదీతో స‌హా చెప్పండి'

ఢిల్లీ : మ‌న భూభాగం నుండి చైనాను ఎప్పుడు త‌ర‌మిస్తారో చెప్పాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు. ఈ సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగిచ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. డియ‌ర్ పీఎం, జాతినుద్దేశించి మీరు చేసే ప్ర‌సంగంలో భార‌త భూభాగం నుంచి చైనాను ఎప్పుడు త‌రిమేస్తారో తేదీతో స‌హా ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిందిగా ప్ర‌శ్నించారు.