శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 11:53:47

భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నా: రాహుల్ గాంధీ

భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నా: రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: కేంద్ర స‌ర్కార్‌పై రాహుల్ గాంధీ మ‌ళ్లీ అటాక్ చేశారు. పార్ల‌మెంట్‌లో వ్య‌వ‌సాయ బిల్లు ఆమోదం పొందిన తీరును ఆయ‌న ఖండించారు. ఆ బిల్లుతో రైతులు బంధీలుగా మారుతార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇవాళ ట్విట్ట‌ర్ ద్వారా రాహుల్ స్పందించారు. లోపాలు ఉన్న జీఎస్టీ వ‌ల్ల దేశంలోని చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, ఇక కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో రైతులు బంధీలుగా మారుతార‌ని రాహుల్ ఆరోపించారు. ఇవాళ దేశ‌వ్యాప్తంగా రైతులు చేప‌డుతున్న భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు రాహుల్ త‌న ట్వీట్‌లో తెలిపారు.