శనివారం 11 జూలై 2020
National - Jun 19, 2020 , 12:16:44

50వ ఏట అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ

50వ ఏట అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం 50వ ఏట అడుగుపెట్టారు. 1970 జూన్‌ 19న ఆయన జన్మించారు. కరోనా సంక్షోభంతోపాటు లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా, భారత్‌ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులు కావడంతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఎలాంటి వేడుకలు జరుపవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అయితే ప్రజలకు సహాయంగా ఉండాలన్నారు.  

మరోవైపు రాహుల్‌ గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని కాంగ్రెస్‌ యవజన సంఘం ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు మౌనంగా నివాళి అర్పించారు. అలాగే పలు చోట్ల  కరోనా కిట్లను పంపిణీ చేశారు. వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్రకు చెందిన యూత్‌ కాంగ్రెస్‌ పేర్కొంది. రాహల్‌ గాంధీకి మంచి జీవితం, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో హోమాన్ని నిర్వహించారు. చైనా వస్తువులను బహిష్కరిస్తామంటూ పార్టీ యువ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలుకు దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. logo