మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 10:35:47

నేటి నుంచి త‌మిళ‌నాడులో రాహుల్ ఎన్నిక‌ల ప్ర‌చారం

నేటి నుంచి త‌మిళ‌నాడులో రాహుల్ ఎన్నిక‌ల ప్ర‌చారం

చెన్నై : త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ కోయంబ‌త్తూరు నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత గంట పాటు చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కార్మికుల‌తో పాటు రైతులు, చేనేత కార్మికుల‌తో స‌మావేశం కానున్నారు. అనంత‌రం రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 5 గంట‌ల‌కు స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు తిరుప్పూర్ కుమార‌న్ స్మార‌క స్థూపాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించ‌నున్నారు. 2019 లోక్‌స‌భ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పొత్తులో భాగంగా 38 స్థానాల్లో గెలిచారు. 

VIDEOS

logo