గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 15:22:13

రిలీఫ్ ప్యాకేజీని స‌మ‌ర్థించిన రాహుల్ గాంధీ

రిలీఫ్ ప్యాకేజీని స‌మ‌ర్థించిన రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌:  పేద‌ల కోసం ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్షా 70 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించారు.  ఈ సంద‌ర్భంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ ప్యాకేజీ ప్ర‌క‌టించారు. దీన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వాగ‌తించారు.  స‌రైన మార్గంలో తొలి అడుగు ప‌డిన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. లాక్ డౌన్ వ‌ల్ల రైతులు, రోజువారి కూలీలు, కార్మికులు, మ‌హిళ‌లు, వృద్ధులు చాలా ఇబ్బందిప‌డుతున్నార‌ని,  అలాంటి వాళ్ల‌కు ప్ర‌భుత్వ ప్యాకేజీ ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌న్నారు.  

క‌రోనా వ‌ల్ల న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే 80 కోట్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ ప‌థ‌కం ద్వారా ప్యాకేజీని అందిస్తామ‌ని మంత్రి సీతారామ‌న్ అన్నారు. కోవిడ్-19 వ‌ల్ల కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌తిఒక్క‌రికీ ఐదు కిలోల బియ్యం లేదా గోధుమ‌ల‌తో పాటు అద‌నంగా వారికి కావాల్సిన కిలో ప‌ప్పును వ‌చ్చే మూడు నెల‌లు అంద‌జేస్తామ‌ని చెప్పారు.


logo
>>>>>>