శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 19, 2020 , 19:03:36

అనాలోచిత లాక్‌డౌన్ వ‌ల్లే అన‌ర్థం: రాహుల్‌గాంధీ

అనాలోచిత లాక్‌డౌన్ వ‌ల్లే అన‌ర్థం: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కోటి మార్కును దాటడానికి కేంద్ర ప్ర‌భుత్వం అనాలోచిత నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ అగ్ర‌ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రణాళిక లేని లాక్‌డౌన్‌తో క‌రోనాపై యుద్ధంలో విజయం మోదీ ప్ర‌భుత్వం సాధించలేకపోయిందని, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిందని రాహుల్ మండిప‌డ్డారు. లాక్‌డౌన్‌తో 21 రోజుల్లో క‌రోనాపై విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని మోదీ చెప్పార‌ని, కానీ దాదాపు తొమ్మ‌ది నెల‌లైనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. కోటి కరోనా కేసులు, 1.5 లక్షల మరణాలతో దేశంలో ప్ర‌జ‌ల జీవితాలు ధ్వంస‌మ‌య్యాయ‌ని విరుచుకుప‌డ్డారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.