బుధవారం 03 మార్చి 2021
National - Jan 24, 2021 , 12:10:51

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పన్నుల వసూళ్లలో ప్రభుత్వం బిజీ : రాహుల్‌

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పన్నుల వసూళ్లలో ప్రభుత్వం బిజీ : రాహుల్‌

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే.. మోదీ ప్రభుత్వం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. వారంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగు సార్లు పెరగ్గా.. దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరిన క్రమంలో ఆదివారం ఆయన కేంద్రంపై ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. జీడీపీ, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరల్లో మోదీజీ విపరీతమైన వృద్ధిని సాధించారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పెట్రల్‌ ధర లీటర్‌కు రూ.85.70కి, ముంబైలో రూ.92.28కి చేరింది. దేశ రాజధాని డీజిల్‌ లీటర్‌కు రూ.75.88కు చేరగా.. ముంబైలో రూ.82.66కు చేరింది.


VIDEOS

logo