e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్ర‌ధానికి ఈగోనే అధికం : రాహుల్ గాంధీ

ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్ర‌ధానికి ఈగోనే అధికం : రాహుల్ గాంధీ

ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్ర‌ధానికి ఈగోనే అధికం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడుతుంటే కేంద్రం సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుపై ముందుకెళ్ల‌డం ప‌ట్ల మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ 13,450 కోట్ల‌ను 45 కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ వేసేందుకు లేదా ఒక కోటి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను సేక‌రించేందుకు వెచ్చించ‌వ‌చ్చ‌ని అన్నారు.

న్యాయ్ ప‌థ‌కం కింద రెండు కోట్ల కుటుంబాల‌కు రూ 6000 కోట్లు అంద‌చేయ‌వ‌చ్చ‌ని సూచించారు. అయితే ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్రధాని ఈగోనే అధికమ‌ని ఎద్దేవా చేశారు. సెంట్ర‌ల్ విస్టా రీడెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కింద ప‌లు నిర్మాణాల‌కు ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో రాహుల్ ఈ మేర‌కు ట్వీట్ చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న మ‌రో ట్వీట్ చేశారు.

Advertisement
ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్ర‌ధానికి ఈగోనే అధికం : రాహుల్ గాంధీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement