బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:06:42

కోవిడ్, చైనాపై ఇచ్చిన హెచ్చ‌రిక‌ల‌ను కేంద్రం కొట్టిపారేసింది : రాహుల్‌

కోవిడ్, చైనాపై ఇచ్చిన హెచ్చ‌రిక‌ల‌ను కేంద్రం కొట్టిపారేసింది :  రాహుల్‌

హైద‌రాబాద్‌: దేశంలో కోవిడ్‌19 కేసులు పెరుగుతున్నాయ‌ని తాను ఇస్తున్న హెచ్చ‌రిక‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రాహుల్ గాంధీ అన్నారు. ల‌డ‌ఖ్‌లో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న అంశాన్ని కూడా కేంద్రం విస్మ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నేత ఆరోపించారు.  కోవిడ్‌19పై వార్నింగ్ ఇస్తున్నా.. ప్ర‌భుత్వం నిర్లిప్తంగా ఉంద‌ని, అందుకే వైర‌స్ కేసులు అధిక‌మైన‌ట్లు ఆయన తెలిపారు. కోవిడ్‌19తో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డే ప్ర‌భావం గురించి వార్నింగ్ ఇచ్చాన‌ని, కానీ ప్ర‌భుత్వం వాటిని కొట్టిపారేసింద‌ని, ఆ త‌ర్వాత విధ్వంసం మొద‌లైంద‌న్నారు. చైనా అంశంలోనూ వార్నింగ్ ఇచ్చాన‌ని, ఆ అంశాన్ని కూడా కేంద్రం కొట్టిపారేస్తున్న‌ద‌ని రాహుల్ ట్వీట్ చేశారు. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 49,310 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 13 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది.

 


logo