బుధవారం 15 జూలై 2020
National - Jun 15, 2020 , 14:08:19

అజ్ఞానం క‌న్నా అహంకారం ప్ర‌మాద‌క‌రం : రాహుల్ గాంధీ

అజ్ఞానం క‌న్నా అహంకారం ప్ర‌మాద‌క‌రం :  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవ‌ల మోదీ ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్న రాహుల్‌.. ఇవాళ కూడా ఓ ట్వీట్ చేశారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేందుకు భౌతిక శాస్త్ర‌వేత్త ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన వ్యాఖ్య‌ల‌ను రాహుల్ త‌న ట్వీట్‌లో ప్ర‌స్తావించారు.  అజ్ఞానం క‌న్నా అత్యంత ప్ర‌మాక‌ర‌మైంది అహంకార‌‌మ‌ని, లాక్‌డౌన్ విధించిన తీరుతో అది రుజువైన‌ట్లు రాహుల్ త‌న ట్వీట్‌లో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.  త‌న ట్వీట్‌తో పాటు ఓ గ్రాఫ్‌ను కూడా ఆయ‌న పోస్టు చేశారు. లాక్‌డౌన్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా దెబ్బ‌తిన్న‌దో, వైర‌స్ మ‌ర‌ణాలు ఎలా సంభ‌వించాయో రాహుల్ ఆ గ్రాఫ్‌లో వివ‌రించారు. 

లాక్‌డౌన్ స‌రైన రీతిలో అమ‌లు చేయ‌డం లేద‌ని ఇటీవ‌ల రాహుల్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.  కొంద‌రు మేధావుల‌తోనూ అత‌ను చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్‌, నోబెల్ గ్ర‌హీత అభిజిత్ బెన‌ర్జీ, పారిశ్రామిక‌వేత్త రాజివ్ బ‌జాజ్‌, అమెరికా దౌత్య‌వేత్త నికోల‌స్ బ‌ర్న్స్‌, హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ అశిష్ జా, స్విడ‌న్ ఫిజిషియ‌న్ జోహ‌న్ గీసెకిల‌తో కోవిడ్ సంక్షోభంపై రాహుల్ ముచ్చ‌టించారు.  


logo