మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:57:54

రాహుల్‌ చైనా రాయబారిని ‘రహస్యం’గా కలిశారు : జేపీ నడ్డా

రాహుల్‌ చైనా రాయబారిని ‘రహస్యం’గా కలిశారు : జేపీ నడ్డా

న్యూ ఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన సమంలో రాహుల్‌ గాంధీ చైనా రాయబారిని రహస్యంగా కలిశారని, దేశంపై ఆయన ప్రేమ బూటకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం విమర్శించారు. కేరళలోని కాసరగోడ్‌లో కొత్తగా నిర్మించిన బిజెపి జిల్లా కమిటీ కార్యాలయం (డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మందిరం) ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. 'డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా రాయబారిని రాహుల్ కలుసుకున్నారనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు (రాహుల్‌ గాందీ) దేశాన్ని తప్పుదారి పట్టించారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ఇద్దరూ కలిసిన ఫోటోను ఆన్‌లైన్‌లో చైనా రాబయబారి పోస్ట్ చేశారు. ఇదీ దేశంపై మీకున్నబూటకపు దేశభక్తి. ‘మీరు (రాహుల్‌)11 రక్షణ కమిటీ సమావేశాలకు గైర్హాజరయ్యారని, మీరు దేశాన్ని నడిపే తీరు ఇదని’ విమర్శించారు. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీలో నడ్డా కోరారు. 'యూడీఎఫ్, ఎల్ డీఎఫ్, కాంగ్రెస్ ఎప్పుడూ దేశాన్ని చీకట్లోనే ఉంచాయని, ఎల్డీఎఫ్‌, యుడీఎఫ్, కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరాలని, రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయాలని కేరళలోని కార్మికులు, ప్రజలను కోరారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo