మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 17:54:41

భారత రాజకీయాలకు సరిపోలని వ్యక్తి రాహుల్‌గాంధీ : కిషన్‌ రెడ్డి

భారత రాజకీయాలకు సరిపోలని వ్యక్తి రాహుల్‌గాంధీ : కిషన్‌ రెడ్డి

ఢిల్లీ : రాహుల్‌ గాంధీ భారత రాజకీయాలకు సరిపోలని వ్యక్తి అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. భారత్‌-చైనా సైనికుల ఘర్షణపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవల వరుస ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత్‌ భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చిందని, గాల్వాన్‌ లోయలో ఆయుధాలు లేకుండా సైనికులు ఎందుకు వెళ్లారని, అసలు అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను దేశ ప్రజలకు వివరించాలని రాహుల్‌ ప్రశ్నించాడు. రాహుల్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ... స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు రాహుల్‌కు అర్థం కావు. అందుకే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అతను మొత్తాన్నికే విఫలుడు. భారత రాజకీయాలకు అతడు సరిపోలడని ఆయన పేర్కొన్నారు.   


logo