గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 15:31:36

ఆర్మీని రాహుల్‌గాంధీ అవమానిస్తున్నారు: శివరాజ్‌సింగ్‌చౌహాన్‌

ఆర్మీని రాహుల్‌గాంధీ అవమానిస్తున్నారు: శివరాజ్‌సింగ్‌చౌహాన్‌

భోపాల్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ విరుచుకుపడ్డారు. ఇండియన్‌ ఆర్మీని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నిరుత్సాహపరచడంతోపాటు అవమానిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎంపీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ, ‘ఆర్మీ సామర్థ్యంపై రాహుల్‌గాంధీ వేసిన ప్రశ్నలు సిగ్గుచేటు. ఆయన ఆర్మీని అవమానించేలా మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.   

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షోభం వచ్చినా బీజేపీ ఆ పార్టీకి సహకరించిందని శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు దేశంపై చైనా దాడికి దిగితే రాహుల్‌గాంధీ కేంద్ర సర్కారుకు మద్దతుగా నిలువాల్సిందిపోయి.. చెత్త రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్‌ ఈ సమయంలో చైనాను విమర్శించాల్సిందిపోయి ప్రధాని నరేంద్రమోడీ గురించి మాట్లాడుతోంది. ఆర్మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రజలు సహించరు.’ అని శివరాజ్‌సింగ్‌చౌహాన్‌‌ వ్యాఖ్యానించారు.   logo