e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఇక ఆరెస్సెస్‌ను సంఘ్‌ పరివార్‌గా పిలవను : రాహుల్‌ గాంధీ

ఇక ఆరెస్సెస్‌ను సంఘ్‌ పరివార్‌గా పిలవను : రాహుల్‌ గాంధీ

ఇక ఆరెస్సెస్‌ను సంఘ్‌ పరివార్‌గా పిలవను : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : ఆరెస్సెస్‌ దాని అనుబంధ సంఘాలను సంఘ్‌ పరివార్‌గా పిలవడం సరైంది కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కుటుంబం అంటే మహిళలు, పెద్దల పట్ల ఆప్యాయత, గౌరవం కనబరిచే వాతావరణం ఉంటుందని, ఆరెస్సెస్‌లో ఇలాంటివి మచ్చుకైనా కనిపించవని వ్యాఖ్యానించారు.

కేరళకు చెందిన నన్స్‌ పట్ల యూపీలో కొందరు మతమార్పిడికి ప్రచారం చేస్తున్నారని వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలపై వివక్ష, ఒక వర్గాన్ని మరో వర్గంపై రెచ్చగొటే సంఘ్‌ పరివార్‌ తీరే నన్స్‌పై వేధింపులకు దారితీసిందని రాహుల్‌ పేర్కొన్నారు. తాను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను ఇక ఎన్నడూ సంఘ్‌ పరివార్‌ (ఐక్య కుటుంబం)గా పిలవబోనని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇక ఆరెస్సెస్‌ను సంఘ్‌ పరివార్‌గా పిలవను : రాహుల్‌ గాంధీ

ట్రెండింగ్‌

Advertisement