గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 13:36:39

'రాహుల్‌గాంధీ మీకు అబ‌ద్దాలు చెప్ప‌డానికి సిగ్గ‌నిపించ‌దా..?'

'రాహుల్‌గాంధీ మీకు అబ‌ద్దాలు చెప్ప‌డానికి సిగ్గ‌నిపించ‌దా..?'

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్య‌లు

భోపాల్‌: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు, మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న‌ద‌న్న రాహుల్‌గాంధీ ఆరోపణ‌ల‌పై శివరాజ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 'రాహుల్‌గాంధీ మీకు అబ‌ద్దాలు చెప్ప‌డానికి సిగ్గ‌నిపించ‌దా..? మీ మాట‌లపై ప్ర‌జ‌లు ఇప్ప‌టికే న‌మ్మ‌కం కోల్పోయారు. ఇంత ప‌చ్చిగా అబ‌ద్దాలు మాట్లాడుతూ ప్ర‌జ‌లు పూర్తిగా మీ మాట‌లు వినిపించుకోని ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్దు' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

అబ‌ద్దాలు చెప్ప‌డం అనేది రాహుల్‌గాంధీ పార్టీకి పునాది అని శివరాజ్‌సింగ్ మండిప‌డ్డారు. గ‌తంలో జ‌రిగిన దేశ విభ‌జన‌‌కు బాధ్యులు ఎవ‌రైనా ఉన్నారు అంటే అది క‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీయే అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo