గురువారం 16 జూలై 2020
National - Jun 26, 2020 , 06:54:37

బీహార్‌ పిడుగుపాటు మృతులకు రాహుల్‌గాంధీ సంతాపం

బీహార్‌ పిడుగుపాటు మృతులకు రాహుల్‌గాంధీ సంతాపం

న్యూఢిల్లీ: బీహార్‌లో పిడుగుపాటు కారణంగా మరణించిన కుటుంబాలకు కాంగ్రెస్‌పార్టీ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. పిడుగుపాటుకు 83 మంది మరణించారన్న వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 

బీహార్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగులు పడ్డాయని, 83 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని సీఎం నితీష్‌ కుమార్‌ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో గురువారం పిడుగులు పడిన ఘటనల్లో 24 మంది, బుధవారం ముగ్గురు మృతిచెందారు.

తాజావార్తలు


logo