'రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు.. నేను రైతు బిడ్డను..'

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు అని.. తాను రైతు కుటుంబంలో జన్మించానని, అన్నదాతల కష్టసుఖాలు తనకు తెలుసని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మీడియా సంస్థ ఏఎన్ఐకి రాజ్‌నాథ్ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులను నక్సల్స్, ఖలీస్తానీలతో పోల్చడంపై రాజ్‌నాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నదాతలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ వయసులో తన కంటే చిన్నవాడు.. అతని కంటే వ్యవసాయం గురించి తనకు బాగా తెలుసు. ఎందుకంటే తాను రైతు దంపతుల కడుపులో జన్మించాను. అటువంటప్పుడు రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటాము? మన ప్రధాన మంత్రి కూడా ఓ పేద తల్లి కడుపులో జన్మించారు. తాను చెప్పెదే ఒక్కటే.. అన్నదాతలకు వ్యతిరేకంగా ఏ పని చేయము అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాము.. వాటిని రెండేళ్ల పాటు అమలు చేయనివ్వాలి అని ఆయన కోరారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం బాధతో ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు
- ఇండియా కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా
- చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
- రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు
- మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ సెక్యూరిటీ
- విషవాయువు లీక్.. ఏడుగురికి అస్వస్థత
- బిడ్డ జాడను చూపించిన ఆవు... వీడియో వైరల్...!
- ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
- దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప్రధాని