సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 01:56:14

మోదీపై చైనా మీడియా ప్రశంసలు

మోదీపై చైనా మీడియా ప్రశంసలు

  • మోదీని పొడగటమంటే ఏమిటర్థం: రాహుల్‌ గాంధీ 

న్యూఢిల్లీ: అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను చైనా మీడియా స్వాగతించింది. మోదీ తాజా వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తాయని అభిప్రాయపడింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ దీనిపై ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. జాతీయవాదులను చల్లబరిచేందుకే మోదీ హెచ్చరికలు చేశారని, అయితే చైనాతో వివాదాలు తగవని అర్థం చేసుకున్న ఆయన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రశ్నలు గుప్పించారు. భారత భూభాగాల్ని ఆక్రమించుకొని, భారతీయ సైనికులను చైనా బలగాలు చంపాయని.. ఈ సంక్షోభ సమయంలో చైనా ఎందుకు మోదీని పొగుడుతున్నదని ఆయన ప్రశ్నించారు.


logo