శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 16:24:12

రోజువారి కూలీల‌కు నేరుగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి: రాహుల్ గాంధీ

రోజువారి కూలీల‌కు నేరుగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి:  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: రోజువారీ కూలీల అకౌంట్ల‌కు నేరుగా న‌గ‌దును జ‌మ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.  కోవిడ్‌19 ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో రోజువారి కూలీలు ఉపాధి కోల్పోయారు.  అయితే అటువంటి వారికి వెంట‌నే ఆర్థిక సాయం చేయాల‌న్నారు.  ఆ కుటుంబాల‌కు రేష‌న్ కూడా ఉచితంగా అందించాల‌న్నారు.  సాయం చేయ‌డంలో ఎటువంటి జాప్యం జ‌రిగినా అది విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంద‌ని రాహుల్  త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  క‌రోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌నున్న‌ట్లు చెప్పారు. ప‌న్ను రాయితీలు క‌ల్పించాల‌ని, ఉద్యోగుల‌కు ఆర్థిక సాయం చేయాల‌న్నారు.  చిన్న వ్యాపారుల‌కు కూడా ప్ర‌భుత్వం హామీ ఇవ్వాల‌న్నారు. క‌రోనా సంక్ర‌మించిన వారు ఐసోలేష‌న్‌లో ఉండాల‌న్నారు.  వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్నారు.  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అత్య‌వ‌స‌ర స్థితిలో తాత్కాలిక హాస్ప‌ట‌ళ్లు నిర్మించాల‌ని రాహుల్ సూచించారు.  దావాఖానాల్లో ఐసీయూ స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరారు.


logo