న్యూఢిల్లీ : ఆప్ ( AAP ) ఎమ్మెల్యే రాఘవ్ చద్దా చూడడానికి అందంగా ఉంటారు. మంచి మాటకారి కూడా. అందులోనూ యువకుడు. అలాంటి యంగ్ లీడర్‌ను ఇష్టపడని యువతులు ఉంటారా? అంటే ఉండరనే చెప్పొచ్చు. అలా ఓ యువతి ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాపై మనసు పారేసుకుంది. తనకు ఉచిత కరెంట్ వద్దు.. రాఘవ్ చద్దానే కావాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఎమ్మెల్యే కూడా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ను పొందొచ్చు అని గుర్దీప్ గురు అనే ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన కీర్తి ఠాకూర్.. తనకు ఉచిత కరెంట్ వద్దు.. ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా కావాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై రాఘవ్ చద్దా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు.
తాను ఆప్ ఎన్నికల మేనిఫెస్టోలో తాను లేను. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కేజ్రీవాల్‌కు ఓటేయండి.. తప్పకుండా మీ ఇంటికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందేలా చూస్తానని రాఘవ్ ట్వీట్ చేశారు.