శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 14:28:16

బ్యూటీ అండ్ బీస్ట్‌.. రాఫెల్ టేకాఫ్ వీడియోలు

బ్యూటీ అండ్ బీస్ట్‌.. రాఫెల్ టేకాఫ్ వీడియోలు

హైద‌రాబాద్‌: భార‌త‌, ఫ్రాన్స్ ర‌క్ష‌ణ స‌హ‌కారంలో కొత్త మైలురాయి ప్రారంభ‌‌మైంది. ఫ్రాన్స్ నుంచి ఇవాళ అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్‌కు బ‌య‌లుదేరాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి. అంత‌క‌ముందు ఆ విమానాశ్ర‌యంలో భార‌త పైల‌ట్ల‌కు.. రాఫెల్ విమానాల‌ను అప్ప‌గించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌తీయ వాయుసేన‌కు చెందిన పైల‌ట్లు ఆ యుద్ధ విమానాల‌ను న‌డుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్రాన్స్‌లో ఉన్న భార‌తీయ అంబాసిడ‌ర్ జావెద్ అష్ర‌ఫ్ మాట్లాడారు. రాఫెల్ విమానాలు అందంగా, భ‌యంక‌రంగా ఉన్నాయ‌న్నారు. అనుకున్న స‌మ‌యానికి డెలివ‌రీ చేసిన డ‌సాల్ట్ కంపెనీకి థ్యాంక్స్ చెప్పారు. భార‌త్‌కు స‌పోర్ట్ ఇచ్చిన ఫ్రెంచ్ ప్ర‌భుత్వానికి, ఆ దేశ వైమానిక ద‌ళానికి కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. భార‌తీయ వాయుద‌ళానికి రాఫెల్‌తో మ‌రింత బ‌లం చేకూర‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఫ్రాన్స్‌లో బ‌య‌లుదేరిన యుద్ధ‌విమానాలు.. యూఏఈలోని అల్ ద‌ఫ్రా ఎయిర్‌బేస్‌లో స్టాప్ తీసుకోనున్నాయి. ఆ త‌ర్వాత బుధ‌వారం రోజున అంబాలా ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు రాఫెల్ విమానాలు చేరుకుంటాయి. ఫ్రాన్స్ నుంచి అంబాలాకు సుమారు 7364 కిలోమీట‌ర్లు ఈ యుద్ధ విమానాలు ప్ర‌యాణిస్తాయి. ఫ్రాన్స్‌తో మొత్తం 36 యుద్ధ‌విమానాల‌కు ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. రాఫేల్ యుద్ధ విమానాల్లో ఎగిరేందుకు భార‌త వాయు సేన‌కు చెందిన 12 మంది పైల‌ట్లు ఫ్రాన్స్‌లోనే శిక్ష‌ణ పొందారు. మ‌రికొంత మంది అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ట్రైనింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మొత్తం 36 మంది ఐఏఎఫ్ పైల‌ట్ల‌కు ఫ్రాన్స్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ది.


   


logo