మంగళవారం 09 మార్చి 2021
National - Jan 20, 2021 , 19:14:42

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్‌ విన్యాసాలు

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్‌ విన్యాసాలు

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఈసారి రాఫెల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కరోనా నేపథ్యంలో విదేశీ అతిథులెవరూ లేకుండా పరిమిత స్థాయిలో రిపబ్లిక్‌ డే ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఫ్రెంచ్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ధ విమానాల్లో ఇప్పటికే కొన్ని దేశానికి చేరాయి. వీటిలో ఒక రాఫెల్‌ యుద్ధ విమానం జనవరి 26న జరిగే రిపబ్లిక్‌ డే విన్యాసాల్లో పాల్గొంటున్నది. తక్కువ ఎత్తు నుంచి నిటారుగా పైకి ఎగిరి రోల్‌ చేసే ‘వెర్టికల్‌ చార్లీ ఫార్మెషన్‌’తో ఆకట్టుకోనున్నది. సంబంధిత రిహార్సిల్‌ వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తన ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం పోస్ట్‌ చేశారు. ‘సుదూర ఆకాశంలో మెరిసే రాఫెల్‌ విన్యాసాలు జనవరి 26 రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్‌లో మీకు కనువిందు చేస్తాయి’ అని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo